ప్రణయ్ హత్య కేసు విచారణ వాయిదా

ప్రణయ్ హత్య కేసు విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. ఇవాళ(మంగళవారం) నల్లగొండ జిల్లా SC,ST ప్రత్యేక కోర్టులో ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. నిందితులు అస్గర్ అలీ, సుభాష్ శర్మను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. మిగతా నిందితులు అబ్దుల్ భారీ, కరీం, శివ, నిజాం కూడా కోర్టుకు హాజరయ్యారు. A1 నిందితుడు మారుతీరావు సోదరుడు,A6గా ఉన్న శ్రవణ్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. A1 నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు.

ప్రణయ్ హత్య 2018 సెప్టెంబర్ 14న జరిగింది. దీనిపై పోలీసులు 2019 జూన్12న 1600  పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో 102 మంది సాక్షుల పేర్లను నమోదు చేశారు. సాంకేతిక పరమైన ఆధారాలు సేకరించడంలో ఆలస్యం కావడంతో చార్జ్ షీట్ దాఖలుకు 9 నెలల సమయం పట్టినట్లు పోలీసులు తెలిపారు.

రిమాండ్ రిపోర్టులో ఏడుగురు నిందితులను చేర్చిన పోలీసులు… ఆటో డ్రైవర్ నిజాంను ఎనిమిదవ నిందితుడిగా చేర్చారు.

Latest Updates