‘కరోనా నుంచి కోలుకోవడంలో ప్రాణాయామం యూజ్ ఫుల్’

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకునే క్రమంలో తనకు ప్రాణాయామం చాలా ఉపయోగపడిందని ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ దత్తా చెప్పాడు. కరోనా పేషెంట్లు శ్వాసను అదుపు చేసే ప్రాణాయామం లాంటి యోగా ప్రక్రియలను ప్రాక్టీస్ చేయాలని రోహిత్ సూచించాడు.యాంగ్జైటీ లెవల్స్ ను తగ్గించడంలో ప్రాణాయామం యూజ్ అవుతుందన్నాడు. కరోనా వస్తే భయపడాల్సింది ఏమీ లేదని.. సానుకూల దృక్పథంతో ఉండాలన్నాడు. ప్రభుత్వంతోపాటు డాక్టర్లపై నమ్మకం ఉంచాలని.. ఏ వ్యాధిని ఎదుర్కోవాలన్నా బలంగా ఉండటమే ముఖ్యమని పేర్కొన్నాడు. కరోనాకు మెడిసిన్ లేనందున పేషెంట్లకు డాక్టర్లు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తున్నారని చెప్పాడు. నార్త్ ఇండియా లో రోహిత్ ఫస్ట్ కరోనా పేషెంట్. ఫిబ్రవరి 24న యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన రోహిత్ కు సాధారణ జ్వరం వచ్చింది. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో అతడికి వైద్యం అందించారు. అక్కడ కరోనా పాజిటివ్ గా తేలడంతో వెంటనే క్వారంటైన్ లో ఉంచారు.

Latest Updates