గాంధీనా.. గాడ్సేనా.. మీరు ఎవరివైపు?

గాంధీజీ ఐడియాలను నమ్ముతూ గాడ్సేను సమర్థించే వాళ్లతో కలిసి నడవలేరు.. ఆ రెండు ఐడియాలజీలకు పొత్తు కుదరదు. అయితే, గాంధీ వైపు లేదంటే గాడ్సే వైపు.. ఎవరో ఒకరివైపే ఉండాలి. ఇద్దరిలో మీరు ఎవరివైపు ఉంటారో చెప్పండి’ అంటూ పోల్​ స్ట్రాటజిస్ట్​ ప్రశాంత్​ కిశోర్​ బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​ను ప్రశ్నించారు. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన పీకే.. మంగళవారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు నితీశ్​కుమార్​ అంటే అభిమానమని అన్నారు. నితీశ్​ కుమార్​ తనకు తండ్రితో సమానమని చెబుతూ ఆయన గురించి చెడుగా మాట్లాడలేనని తెలిపారు. ఓ పార్టీ నాయకుడిగా తాను ఎవరివైపు ఉంటారో నితీశ్​ చెప్పాలని డిమాండ్​ చేశారు. గాంధీజీ ఐడియాలజీని నమ్ముతానని, ఆయన అడుగుజాడల్లోనే ఎల్లప్పుడూ నడుస్తానని తనతో నితీశ్ చాలాసార్లు చెప్పారన్నారు. అధికారం కోసం ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని అడిగారు.

 

Latest Updates