సీఎం జగన్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ

అమరావతి: తిరుపతి ఉప ఎన్నికపై విగ్రహాల ధ్వంసం ఘటనల ప్రభావం లేకుండా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం తాడేపల్లి నివాసంలో సీఎం జగన్‌ ను ప్రశాంత్ కిషోర్ కలిశారు.  ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలు ప్రభుత్వాన్ని

ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో పాటు త్వరలో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో జగన్, పీకే భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విగ్రహాల ధ్వసంపై సీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓ కమిటిని ఏర్పాటు చేసింది. అంతేకాదు సీఐడీ విచారణ చేసిన అసలు దోషులను మాత్రం గుర్తించలేకపోయారు. ఇంత చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆగ్రహావేశాలు చల్లారడం లేదు.  ఈ క్రమంలోనే ప్రశాంత్‌ కిషోర్‌తో సీఎం భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.

Latest Updates