ప్రశాంత్ కిశోర్.. ఆమ్ఆద్మీ టై అప్..ఢిల్లీ ఎన్నికలపై కసరత్తు

న్యూఢిల్లీ:  వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్​) కసరత్తు మొదలుపెట్టింది.  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​  ఆధ్వర్యంలో నడుస్తున్న  పొలిటికల్​ కన్సల్టెన్సీ  సంస్థ.. ఇండియన్​ పొలిటికల్​ యాక్షన్​ కమిటీ (ఐ-పాక్)​ ఆప్ తో కలిసి పనిచేయనుంది.  ఆప్​ కన్వీనర్​, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్​ కేజ్రీవాల్​ ఈ విషయాన్ని  ప్రకటించారు. “ ఐ-పాక్ మాతో కలిసి పనిచేస్తుందని తెలియజేయడానికి హ్యాపీగా ఉంది. ఐ-పాక్ కి వెల్​కమ్​”అని కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు.

ఢిల్లీ సీఎం ట్వీట్​కి  ఐ-పాక్  రిప్లై ఇచ్చింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆప్​  గట్టి పోటీ ఇచ్చిందని గుర్తుచేసుకుంది.   పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో   ప్రశాంత్​ కిశోర్​ టీమ్​ కాంగ్రెస్​ పార్టీకి పనిచేసింది. హస్తంపార్టీని అధికారంలోకి రావడానికి  కృషిచేసింది.

“ మేము ఇంతవరకు ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో మీరే  గట్టి సత్తా ఉన్నవాళ్లని పంజాబ్​ అసెంబ్లీ  ఫలితాల​తర్వాత గుర్తించాం.  కేజ్రీవాల్​, ఆప్​తో కలిసి మా టీమ్​ పనిచేయడం ఆనందంగా ఉంది”అని  ఐ-పాక్ ట్వీట్​ చేసింది.  ప్రశాంత్​ కిశోర్​ జనతాదళ్​ (యూ)కి వైస్​ప్రెసిడెంట్​గా ఉన్నారు. పార్లమెంట్​లో సిటిజన్​షిప్​ సవరణ బిల్లును  జేడీయూ  సపోర్ట్​ చేయడాన్ని ప్రశాంత్​కిశోర్​  విమర్శించడంతో తాజాగా వార్తల్లో నిలిచారు.

Latest Updates