ఏపీలో ‘హోదా భరోసా యాత్ర’ ప్రారంభించిన కాంగ్రెస్

అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామం నుంచి “కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర” ప్రారంభమైంది. బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉమేన్ చాందీ. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, కేవీపీ రాజేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఈయాత్రలో పాల్గొంటున్నారు.

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 3 వరకు తొలివిడత బస్సుయాత్రను పీసీసీ నేతలు నిర్వహిస్తారు. ఇవాళ మడకసిర, హిందూపూర్, పెనుకొండ, మామిళ్లపల్లి, అనంతపురంలో యాత్ర సాగుతుంది. ప్రత్యేక హోదా అమలు రాహుల్ గాంధీతోనే సాధ్యం అన్న నినాదంతో జనంలోకి వెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Latest Updates