ఐటీ గ్రిడ్స్ CEO అశోక్ ముందస్తు బెయిల్ మంజూరు

ఏపీ పౌరుల డేటా చోరీ కేసులో హైదరాబాద్ మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ CEO అశోక్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది. హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు ముందస్తు బెయిల్ ఇచ్చింది. పోలీసుల విచారణకు సహకరించాలని అశోక్ ను ఆదేశించింది హైకోర్టు.

డేటా లీక్ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల కింద హీట్ పెంచింది. రెండు రాష్ట్రాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ను ఏర్పాటుచేశాయి. అశోక్ ను ప్రశ్నించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా.. ఆయన పోలీసు విచారణకు సహకరించాలంటూ ముందస్తు బెయిల్ మంజురుచేసింది హైకోర్టు.

Latest Updates