హైపర్ పిగ్మెంటేషన్‌‌‌‌కి చెక్‌‌‌‌ పెట్టండిలా..

చాలామందిని ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో హైపర్ పిగ్మెంటేషన్‌‌‌‌ ఒకటి. చర్మం ముదురు రంగులోకి మారి పట్టిల్లాగా అయిపోవడం, నల్లటి మచ్చలు తేలడం లాంటివి వస్తే  తేలికగా తీసుకోకూడదు. దాన్ని హైపర్ పిగ్మెంటేషన్‌‌‌‌గా గుర్తించి.. వెంటనే జాగ్రత్తలతో పాటు అవసరమైతే ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకోవాలి.

హైపర్‌‌‌‌‌‌‌‌ పిగ్మెంటేషన్ ఏ రకం చర్మానికైనా వచ్చే అవకాశం ఉంది. ఎండలో ఎక్కువగా తిరిగేవాళ్లలో ఫేస్‌‌‌‌ మీద ..  చేతులు, కాళ్ల మీద కూడా ఈ‌‌‌‌ పిగ్మెంటేషన్‌‌‌‌ వస్తుంది. ఎండతో పాటు ఈ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అవేంటంటే..

 •    ఏజ్‌‌‌‌ స్పాట్స్‌‌‌‌
 •    గాయాలు మానిన తర్వాత ఆ మచ్చలు అలాగే ఉండిపోవడం లేదా గాయాలు మానే టైమ్‌‌‌‌లో వాటిని గిల్లడం
 •    ప్రెగ్నెంట్ టైమ్‌‌‌‌లో వచ్చే హర్మోన్‌‌‌‌,
 •    జెనిటిక్ మార్పులు
 •    ఇతర వ్యాధులకు వాడే మెడిసిన్ తాలూకు  సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌
 •    హానికరమైన కాస్మొటిక్స్ వాడటం
 •    హెయిర్ డై వల్ల కలిగే ఎలర్జిక్ కాంటాక్ట్
 •    స్ట్రెస్, ఎమోషనల్‌‌‌‌ షాక్స్‌‌‌‌
 •    చర్మంపై పొక్కులు, గడ్డలు, మొటిమలు
 •    కామెర్లు రావడం

ఇంటి చిట్కాలు

 •    అలోవెరా రాస్తే దానివల్ల చర్మానికి తేమ అందుతుంది. ఇది ఎండలో ఉండే యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది.
 •    పెరుగులో తేనె కలిపి చర్మానికి అప్లై చేసుకుంటే చాలా వరకు ఈ పిగ్మెంటేషన్ తగ్గుతుంది.
 •    గ్రీన్ టీ తాగినా  ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌

దేని వల్ల ఈ పిగ్మెంటేషన్ వచ్చిందో తెలుసుకోవడానికి టెస్ట్‌‌‌‌ చేయాలి. తర్వాత హైపర్ పిగ్మెంటేషన్‌‌‌‌ నుంచి చర్మాన్ని కాపాడటానికి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగా స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్‌‌‌‌తో పాటు  లేజర్స్‌‌‌‌, ఇంటెన్స్ పల్స్‌‌‌‌ లైట్‌‌‌‌, కెమికల్ పీల్స్, మైక్రోడెర్మాబ్రేషన్‌‌‌‌ లాంటి కాస్మొటిక్‌‌‌‌ ప్రొసీజర్స్‌‌‌‌ని ఉపయోగిస్తారు.

డాక్టర్ వ్రితికా గడ్డం,ఎం.డి. డెర్మటాలజీ,

నావా స్కిన్ అండ్ బాడీ కేర్, హైటెక్స్, హైదరాబాద్.

ఆన్​ లైన్ కన్సల్టేషన్ కోసం​ 7799726282.

 

బ్యూటీ మంత్ర.. టైగర్ గ్రాస్

Latest Updates