ఆన్ లైన్ షాపింగ్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Precautions to take on online shopping

Precautions to take on online shoppingఇంటర్నెట్ లో బ్రౌజింగ్ ప్రారంభించగానే మీకు ఫ్రీగా స్మార్ట్​ఫోన్​ అందిస్తాం , ఉచితంగా ల్యాప్ టాప్ అందిస్తాం అంటూ ప్రకటనలు తరచూ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ప్రాసెస్ లో మీరు చేయాల్సిన పని ఒక్కటే మీ డిటైల్స్​తో కూడిన ఫాంని ఫిల్ చేసి అందించడమే. తెలియని వ్యక్తికి ఏ కంపెనీ గిప్ట్ ఇవ్వదు. కానీ కొందరు ఇదేం పట్టించుకోకుండా సదరు వ్యక్తికి వ్యక్తిగత వివరాలను పంపిస్తారు. ఇలా సంబంధిత వ్యక్తి వివరాలు తీసుకుని రెండు రోజుల్లో ప్రాసెస్ జరిగిపోతుందని చెప్పి. ఆతర్వాత మీ ప్రొడక్ట్​ రెడీగా ఉంది కానీ కస్టమ్​ ఛార్జీలు పంపించమని అడుగుతారు. వస్తువుని బట్టి ఛార్జీలు ఉంటాయని నమ్మిస్తారు. మీ ప్రొడక్ట్​ వాల్యూ లక్ష అని చెప్పి దాంట్లో మీరు 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని చెప్తారు. సదరు వ్యక్తి డబ్బులు పంపించిన తర్వాత నుంచి వినియోగదారునికి ఎలాంటి సమాచారం ఉండదు. వెబ్ సైట్ చూస్తే ఎలాంటి వివరాలు ఉండవు. ఒకవేళ ఆర్డర్ డెలివరీ చేసినా ఆర్డర్ చేసిన దానికి బదులుగా మరొక ప్రొడక్ట్​ అంటగడతారు. అందువల్ల ఇలాంటి వెబ్ సైట్స్​కి దూరంగా ఉండాలి.

నకిలీ సైట్లను కనిపెట్టడానికి కొన్ని ట్రిక్స్..

  • నిజానికి మనం చూసే వెబ్ సైట్లో చాలా వరకు నకిలీవే.. ఏది వాస్తవమనేది తెలుసుకోవడం కాస్త కష్టమే. కానీ కొనే ముందు వ్యాపారుల వివరాలను BBB.org లో చెక్ చేసుకోవాలి.
  • ప్రైవసీ పాలసీ ద్వారా వెబ్ సైట్ అథెంటసిటీని నిర్థారించుకోవచ్చు.
  • HTTPS వెబ్ సైట్స్ నుంచి కొనుగోళ్లు కాస్త సురక్షితం.
  • ఆన్​లైన్​లో ఒకే డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించడం మంచిది. అంతేకాదు మొబైల్, ల్యాప్ టాప్ లలో పాస్ వర్డ్స్ సేవ్ చేసుకోవద్దు.
  • ఆన్​లైన్​లో వస్తువు కొనే ముందు రీఫండ్ ఉందో లేదో చూసుకోవాలి.
  • వస్తువు కొనే ముందు వెబ్ సైట్ ప్రైవసీ పాలసీలను కూడా చెక్ చేసుకోవాలి.
  • సోషల్ మీడియాలో ఉచితమంటూ వచ్చే భారీ ఆఫర్లను నమ్మి వ్యక్తిగత వివరాలను, బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించకండి.
  • ఆన్​లైన్​లో డబ్బులు చెల్లించే ముందు ఫోన్​ నెంబర్, కంపెనీ అడ్రస్ ఉన్నాయో లేదో గమనించాలి.
  • మొబైల్ లాంటి సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేసే ముందు మొబైల్ ఐఎమ్​ఈఐ నెంబర్ ని, ఫోన్​ బిల్ ని పక్కాగా చూసుకోవాలి.
  • అలాగే సాధ్యమయినంత వరకు ఆన్​లైన్ షాపింగ్ కి క్రెడిట్ కార్డుని ఉపయోగించండి. ఆన్​లైన్​ పేమెంట్ మెసేజ్ లను కూడా జాగ్రత్తగా దాచుకోవాలి.

Latest Updates