వడదెబ్బ.. ఇంట్లో ఉన్నా వదలదు

ఎండకు బయటకు పోవాలంటే అందరూ భయపడ్తరు. జర ఎండలు షురు కాగానే ఒక్కపూట బళ్లు మొదలైతయ్‌ . తర్వాత రెండు నెలలు బళ్లు మొత్తం మూసేస్తరు. ఇక్కడే అర్థమైతుంది ఎండాకాలం తీవ్రత ఏంటో! ఆటలు ఆడుకోవడానికి.. ఎంజాయ్‌ చెయ్యడానికి ఎండాకాలం మంచి టైం అని చాలామంది.అనుకుంటరు. అది నిజమే కానీ.. ఈ ఎండాకాలం ఆరోగ్యాన్ని కూడా రిస్క్‌‌ల పెడ్తది. గవన్ని మనసుల పెట్టు కుని జర పైలంగా ఉంటే.. ఈ కాలం మంచిదే! ఎండాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది వడదెబ్బ! మరి అది ఎట్ల వస్తది? ఎందుకొస్తది? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

వడదెబ్బ (హీట్‌ స్ట్రోక్‌ ) అంటే?

104 నుంచి105 డిగ్రీల జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి జారిపోవడాన్ని హీట్ స్ట్రోక్‌ అంటాం. ఇది వడదెబ్బ చివరి దశ. హై ఫీవర్‌‌తో పాటు మనిషి స్పృహ తప్పిపోతాడు.

ఎండసెగ ఎవరెవరికి వస్తది?

బయట ఎండలో తిరిగితేనే వడదెబ్బ  తగులుతుందనేం లేదు. ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా తగులుతది. ఎండలో ఎక్కువగా కష్టపడేవాళ్లకు వచ్చే వడదెబ్బని ‘ఎగ్జా షన్‌‌ హీట్‌‌ స్ట్రో క్‌ ’ అంటరు. భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికు లకు, రైతు కూలీలకు, ఎండలో విధులు నిర్వహించే ఆర్మీ, పోలీసులు ఈ ఎగ్జా షన్‌‌ హీట్‌‌ స్ట్రో క్‌ బారిన పడ్తరు. ఎండలో కష్టపడకున్నా .. ఇంట్లో ఉన్నా వచ్చే దాన్ని ‘క్లా సిక్‌ హీట్‌‌ స్ట్రో క్‌ ’ అంటారు. బయటి ఎండకు చుట్టూ వ్యాపించి ఉన్న వేడి సోకడం వల్ల ఇది వస్తుంది. ఇది ఎక్కువగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్లకు వస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాలు , గుండె సంబంధించిన వ్యాధులున్న వాళ్లకు , కొన్ని మందులు వాడుతున్న వాళ్లకు కూడా ఈ ‘క్లా సిక్‌ హీట్‌‌ స్ట్రో క్‌ ’ వస్తుంది. వాళ్లు వాడే మందుల్లో చెమటని తగ్గించే గుణం ఉంటుంది. అలాంటి వాళ్లు జాగ్రత్తలు తీసుకోకుంటే క్లా సిక్ హీట్‌‌స్ట్రో క్‌ రావడం ఖాయం.

ఎలా గుర్తించాలి?

లక్షణాలను పరిశీలిస్తే వడదెబ్బ తగిలిందనే విషయం సులభంగా గుర్తించవచ్చు. వెంటనే తగిన చర్యలు తీసుకుంటే వడదెబ్బ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. తలనొప్పి రావడం. నీరసంగా అనిపించడం. కాళ్లల్లో తిమ్మిర్లు రావడం. పని ఏకాగ్రత తగ్గి గందరగోళపడటం చెమటలు పట్టకపోవడం.. నాడి వేగంగా కొట్టు కోవడం..వంటి లక్షణాలు ఉంటే తొలిదశ వడదెబ్బగా గుర్తించాలి.

అప్పుడేం చెయ్యాలి?

లక్షణాలు కనిపించిన వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశంలోకి మార్చాలి. ఫ్యాన్‌‌, కూలర్‌‌ లేదా ఏసీ ఉన్న గదిలో పడుకోబెట్టాలి. కొన్ ని ద్రవ పదార్థాలు ఇస్తే.. కొద్ది సేపటి తర్వాత ఆ లక్షణాలు అన్ని తగ్గిపోతాయి. అయితే ఇది తొలిదశలోనే పని చేస్తుంది.

హైపర్‌ హీట్‌ స్ట్రో క్‌ అంటే?

పైన చెప్పిన లక్షణాలతో పాటు 104 నుంచి 105 డిగ్రీల జ్వరం ఉంటే హైపర్‌‌‌‌ హీట్‌‌స్ర్టోక్‌ అంటారు. ఈ సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతరు. వడదెబ్బలో ఇది చివరి దశ. ఈ టైంలో వాళ్లని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లా లి. ఆస్పత్రి దూరంగా  ఉంటే వాళ్లని కూల్‌ వాటర్‌‌‌‌లో ఉంచాలి. లేదా ఐస్‌‌ వేసిన వాటర్‌‌‌‌ డ్రమ్‌ లో తల ఒక్కటి పైకి ఉంచి… మిగతా శరీరమంతా దానిలోపల మునిగేలా చూడాలి. లేదా మెడపై.. గజ్జల్లో .. ఐస్‌‌ ప్యాక్‌ పెట్ టి ఫ్యాన్‌‌ కింద పడుకోబెట్టాలి. ఆసమయంలో టెంపరేచర్‌‌‌‌ 101 వరకు తగ్గించిన పర్వాలేదు. సాధారణ శరీర ఉష్ణోగ్రతకు రాకున్నా ఏం కాదు. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డట్టే.

హైపర్‌ హీట్‌ స్ట్రో క్‌ ని నిర్లక్ష్యం చేస్తే?

హైపర్‌‌‌‌ హీట్‌‌ స్ట్రో క్‌ ని నిర్లక్ష్యం చేస్తే.. శరీరంలో రక్తం గడ్డ కట్టే వ్యవస్థతో పాటు లివర్, కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌‌‌‌ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అది ప్రాణాల మీదకు తెస్తది. కాబట్టి తొలి దశలోనే వడదెబ్బను గుర్తించి.. చల్లని ప్రదేశాలకు  తరలించి.. ద్రవ పదార్థాలు తాగించాలి.

కొంతమంది ఎండలో ఉన్నా..వడదెబ్బ రాదు ఎందుకు?

ఎండకు అలవాటు అయినోళ్లకు వడదెబ్బ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎండాకాలం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారుతుంది. సడెన్‌‌గా దానికి ఎక్స్‌ పోజ్‌ అయినోళ్లకు హీట్‌‌స్ట్రో క్‌ వస్తుంది. భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికు లకు ఎందుకు రావడం లేదంటే.. వాళ్లు ఆఉష్ణోగ్రతకు నెమ్మదిగా అలవాటుపడతారు. వరుసగా కొన్ని గంటలపాటు ఎండలో పనిచేస్తే వాళ్లకు కూడా హీట్‌‌ స్ట్రో క్‌ వస్తుంది. కాబట్టి వాళ్లకు వడదెబ్బ తగలొద్దం టే.. అర గంటకు ఒకసారి నీడకు వచ్చిపోతుండాలె. పని చేస్తూనే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఎండకు ఎట్ల అలవాటు పడాలి?

ఒకేసారి వరుసగా అన్ని గంటలు ఎండలో ఎవరూ పని చేసినా.. కచ్చితంగా ఎండసెగ తాకు తది. కాబట్టి కొద్దికొద్దిగా ఎండకు అలవాటయ్యేలా చూసుకోవాలి. రోజుకి అరగంట చొప్పున పెంచుకుంటూ పోవాలి. దీన్నే ఎక్స్‌ లిమిటైజేషన్‌‌ అంటరు. ముఖ్యంగా అథ్లెట్లకు .. బయట పని చేసే వాళ్లకు ఇది వర్తిస్తుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎండాకాలంలో వడదెబ్బ ఎవరికైనా తగలొచ్చు. కాబట్టి ఎండ ఉన్నన్ని రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్‌‌‌‌లో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు పోవద్దు. ఏవైనా పనులుంటే పొద్దున 11లోపు.. సాయంత్రం నాలుగు తర్వాత పనులు ప్లాన్‌‌ చేసుకుంటే మంచిది. ఒక వేళ అర్జెం ట్ పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. గొడుగు లేదా టోపి పెట్టుకుని బయటకు పోవాలి.ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.నీళ్లు… కొబ్బరి నీళ్లు‌‌, మజ్జిగ తాగాలి. కూల్‌ డ్రింక్స్‌ తాగొద్దు. ఎండలో తిరిగినప్పుడు చెమటతో పాటు ఎలక్ట్రో లైట్స్‌ కూడా బయటకు పోతాయి. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు ఉప్పు వేసిన నిమ్మరసం లాంటివి తాగాలి. దాహం కావట్లేదని నీళ్లు తాగకుండా ఉండొద్దు. ఇంట్లో ఉండేవాళ్లయితే రోజుకు రెండున్నర నుంచి మూడు, బయట తిరిగేవాళ్లు ఆరు లీటర్ల వరకు నీళ్లుతాగాలి. నీళ్లు తాగకుంటే శరీరం డీహైడ్రేట్‌‌ అవుతుంది. ఎండాకాలంలో మసాలాలు ఉండే ఆహారం తినొద్దు. నాన్‌‌వెజ్‌ ..బిర్యానీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.డ్రగ్స్‌ .. ఆల్కహాల్‌ .. స్మోకింగ్‌‌ చేసేవాళ్లకువడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ.

ఎండకాలంలో ఇంక ఏమేం రిస్క్‌ లుంటయ్?

ఎండలో తిరగడం వల్ల ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాల వల్ల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు.అయితే.. ఫైనల్‌ గా ఎండాకాలంలో అన్నింటికంటే పెద్ద ప్రమాదం ఏందంటే..వడదెబ్బే! కాబట్టి

Latest Updates