పురిటి నొప్పులతో.. వాగులో నడుస్తూ..

గుండాల వెలుగు: వాన పడిందంటే వాగులు పొంగి.. ఊరుదాటడం గగనమవుతుంది. రోగమొచ్చినా నొప్పొచ్చినా ఆస్పత్రికి వెళ్లడానికి నానాతిప్పలు పడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సాయనపల్లికి చెందిన వూకే శంకరమ్మకు మంగళవారం పురిటి నొప్పులు రాగా పొంగిపొర్లుతున్న వాగులోంచి నడిపించుకుంటు తీసుకెళ్లారు. ఆటోలో ఏడుమెలికల వాగు దగ్గరకు తీసుకవచ్చిన ఆమె కుటుంబసభ్యులు తాత్కలికంగా నిర్మించిన వంతెన తెగిపోవడంతో నిండుగర్భిణిని వాగులో నడిపిస్తూ దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. వంతెనలు కట్టేందుకు నిధులు మంజూరైనా పనులు సాగడంలేదని సాయనపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిసారి వానాకాలంలో కష్టాలు పడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదన్నారు.

For More News..

వికాస్‌‌‌‌ దుబే కేసులో.. ఎలాంటి కమిటీ కావాలె?

ఆఫీసులకు రాకండి..  వాట్సాప్ చేయండి

మమత సర్కారును డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేయండి

Latest Updates