అత్తింటి వేధింపులు: నిండు గర్భిణి ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: అత్తిం టి వేధింపు లు తట్టుకోలేక నిండు గర్భణి  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..గాజులరామారం రోడ్డు వివేకానంద్ నగర్ కి చెందిన అనిల్ రెడ్డికి 2016 నవంబర్ లో ఇదే ప్రాంతానికి చెందిన ఎస్.రేఖారెడ్డి(26)తో పెళ్లైం ది. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.14లక్షలు అనిల్ రెడ్డి తీసుకున్నాడు. ఈ దంపతులకు ఏడాదిన్నర పాప ఉంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న రేఖారెడ్డిని అత్త, ఆడపడుచు, భర్త అదనపు కట్నం కోసం వేధించేవారు. బుధవారం ఉదయం అత్తిం టి వారు రేఖారెడ్డితో మరోసారి గొడవ పెట్టుకున్నారు. దీంతో ఆవేశంతో గదిలోకి వెళ్లిన రేఖారెడ్డి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తవారింట వేధింపులు తట్టుకోలేక రేఖారెడ్డి ఆత్మహత్య చేసుకుం దని బంధువులు అంటున్నారు. మరోవైపు గర్భిణిగా ఉన్న రేఖారెడ్డికి మొదటి సంతానం పాప కాగా.. ళ్లీ ఆడశిశువు పుట్టబోతోందని ముందే తెలుసుకున్న అత్తిం టి వారే ఆమెను చంపేశారని మృతురాలి తల్లి, అన్న ఆరోపిస్తున్నారు. రేఖారెడ్డి అన్న కంప్లయింట్ మేరుకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Latest Updates