దారుణ హత్యకు గురైన గర్భిణీ మహిళ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలోని మంగల్ పల్లి  దారుణం జరిగింది.  మంగల్ పల్లి గేట్ సమీపంలో ఓ మహిళను ధారుణంగా హత్య చేశారు . మృతురాలు నేనవత్ సరితా(22) పోచమ్మగడ్డతండా కందుకూరు మండలం వాసిగా గుర్తించారు. ఆమె భర్త రాజు నిత్యం వేధింపులకు గురిచేసేవాడని, అతనే హత్య చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఆసుపత్రిలో పరీక్షల కోసం సరిత తన భర్తతో వెళ్లిందని, ఆ తర్వాత వారిద్దరి ఆచూకి తమకు తెలియలేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం సరిత భర్త పరారీలో ఉండటంతో అతనే హత్య చేసి పరారైనట్టు వారు అనుమానిస్తున్నారు. మృతురాలిపై శనివారం కందుకూరు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు ఈ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టారు.

Latest Updates