లాక్ డౌన్ తో నిండుగర్భిణి 100 కిలోమీటర్లు నడిచింది

పనికోసం ఉన్న ఊరిని వదిలి వేరే ప్రాంతానికి వచ్చిన ఓ దంపతులకు..లాక్ డౌన్ కారణంగా ఉపాధిలేకుండా పోయింది. దీంతో సొంత గ్రామానికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. రవాణ సౌకర్యాలు కూడా లేక పోవడంతో కాలినడక బయల్దేరారు. అయితే ఆమె అప్పటికే నిండు గర్భిణి. అయినా ఎంతో కష్టపడి 100 కిలో మీటర్లు నడిచింది. దారి మధ్యలో వారి పరిస్థితి చూసిన పోలీసులు…ఇంటికి చేర్చారు. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని షహాన్పూర్‌లోని కర్మాగారంలో వకీల్ పనిచేస్తున్నాడు. అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నఅమర్‌గఢ్ వీరి స్వగ్రామం. ప్రస్తుతం వకీల్ భార్య గర్భవతి, లాక్‌డౌన్‌ కారణంగా కర్మాగారం మూతపడింది. పనిలేకపోవడంతో సొంత ఊరి బాటపట్టారు. ప్రయాణ సౌకర్యం కూడా లేదు. దీంతో ఆ దంపతులు చివరికి చేసేది ఏమీ లేక కాలికి పనిచెప్పారు. సరైన తిండి లేక గర్భిణి అయిన ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు లోనైంది. వీరి దీనావస్థను గమనించిన స్థానికులు… పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు స్థానికుల సాయంతో కొంత డబ్బు, అంబులెన్స్ ఏర్పాటు చేసి వారి సొంతూరికి చేర్చారు.

Latest Updates