సాహసం.. గర్భిణిని వరద నుంచి కాపాడిన జవాన్లు

pregnant-woman-rescued-in-flood-hit-palakkad-districts-agali-in-kerala-634576478

కేరళలో వరద కష్టాలు పెరిగాయి. మొత్తం 14 జిల్లాలకు గాను 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, వైమానిక బృందాలు సహాయక చర్యల్లో నిరంతరం పాల్గొంటున్నాయి.

పాలక్కడ్ జిల్లాలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు రెస్క్యూ బలగాలు. అగలి అనే ప్రాంతాల్లో ఓ గర్భిణిని సాహసోపేతంగా వాగు దాటించారు. ఓ ఇంటి డాబాపై ఉన్న బాధితురాలిని చేరుకున్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఆమె ఒంటికి తాడు కట్టి.. మరో తాడు సహాయంతో… ఇబ్బంది లేకుండా వాగు అవతలి ఒడ్డునుంచి.. ఇవతలికి చేర్చారు. ఆ తర్వాత వాహనంలో ఆమెను కుటుంబసభ్యులతో సహా షెల్టర్ కు పంపించారు.

2018 ఆగస్ట్ లో కేరళలో వందేళ్లలో ఎన్నడూ రాని వరదలు వచ్చాయి. ఆ వరదలతో కేరళ భారీస్థాయిలో నష్టపోయింది. మళ్లీ అదే ఆగస్ట్ నెలలో కేరళను వరదలు వణికిస్తున్నాయి.

Latest Updates