వాగు ఉగ్రరూపం: నాటు పడవలో హస్పిటల్ కు గర్భిణీ

ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అలుబాక పంచాయతీ పరిధిలోని పెంకవాగు, జిన్న వాగు ఉగ్రరూపం దాల్చాయి. వరదనీరు రోడ్లపైకి భారీగా చేరుకుంది. దీంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళను.. వాగు దాటించలేని పరిస్థితి నెలకొంది. 108 కి ఫోన్ చేసినా వాగుదాటి రాలేమని చెప్పడంతో.. సాయం కోసం వాగు దగ్గరే పడిగాపులుగాశారు మహిళ కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారి రమాదేవి, నాటు పడవల ద్వారా గ్రామానికి చేరుకుని.. మహిళను వెంకటాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

Latest Updates