కరోనా భయంతో టీకాలు వేయించుకుంటలేరు..

హైదరాబాద్, వెలుగు :గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్‌పైనా కరోనా ఎఫెక్ట్ పడుతోంది. పీహెచ్సీలో ర్యాపిడ్ టెస్ట్‌లు
చేస్తుండడంతో జనరల్ చెకప్‌లకు జనం వెళడ్లం లేదు. నెల నెలా వే యించుకోవాల్సిన టీకాలనూ వాయిదా వేసుకుంటున్నారు. ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే టీకాలను చిన్నారులు పుట్టినప్పటి నుంచి 16 ఏండ్లవయస్సు వరకు ఇంజక్షన్,ఓరల్ డ్రాప్స్ ద్వారా ఇస్తారు. గర్భిణులకు ఇచ్చే తల్లిటీకాలను కూడా తప్పనిసరిగా వేయించుకో వాలి. ప్రతి నెలా మస్ట్‌గా ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండడం పుట్టబోయే బిడ్డలు, చిన్నారు లకు మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు. సిటీలో 92 పీహెచ్‌సీలు, 113 బస్తీ దవాఖానాల్లో ప్రతి బుధవారం టీకాలు వేస్తారు. సిబ్బంది డ్యూటీలోఉంటు న్నా 40శాతానికి మించి వ్యాక్సినేషన్ జరగడం లేదు.


ర్యాపిడ్ టెస్టులతో దూరం

 గ్రేటర్ పరిధిలో 90, రంగారెడ్డిజిల్లాలో 20, మేడ్చల్ జిల్లాలో 79 హెల్త్ సెంటరను్ల ర్యాపిడ్ టెస్ట్ లకు వినియోగిస్తున్నారు. దాంతో ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ తగ్గిపోతోంది. కొంతమంది ప్రైవేట్హాస్పిటల్ను ఆశ్రయిస్తున్నారు. లాక్డౌన్ కు ముందు ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ప్రతి నెలా 5, 4 00 దాకా టీకాలు వేశారు. 3 నెలల నుంచి 2,500 కూడా ఇవ్వలేదని సిబ్బంది చెప్తున్నారు. ప్రతి నెలా వచ్చి మెడికల్ టెస్ట్‌లు చేసుకునే గర్భిణుల సంఖ్యకూడా  తగ్గిపోయింది.  ఫోన్ ద్వారా గర్భిణులను సంప్రదించినా రెస్పాన్స్లేదని విద్యా నగర్ హెల్త్ సిబ్బంది తెలిపారు. తమ పీహెచ్సీ పరిధిలో 9 మంది ఆశ వర్కర్లు పనిచే స్తుండగా,ఒక్కొక్కరి పరిధిలో ఐదుగురు నుంచి 8 మంది గర్భిణులు ఉన్నారని, వారిలో సగం మంది కూడా కాంటాక్టులో ఉండట్లేదని చెప్పారు.

రామాంతాపూర్ కు చెందిన లక్ష్మీప్రసన్నకు 4 నెలల బాబు ఉన్నాడు. కరోనా భయంతో మంత్లీ హెల్త్ చెకప్ కు వెళ్లడం లేదు. ప్రతి నెలా వేయాల్సిన టీకాను వాయిదా వేసింది. చివరకు డాక్టర్ మందలించడంతో స్థానిక పీహెచ్సీలో వేయించింది.

9 నెలల అక్షిత్‌కు ఏడాదిలోపు ఎంసీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. బాగ్ అంబర్ పేట పీహెచ్‌సీకి వెళ్తే అక్కడ ర్యాపిడ్ టెస్టు లు చేస్తున్నారు. దాంతో పేరెంట్స్ వెనక్కి వచ్చారు. స్థానిక ఏఎన్ఎం ఆశ్రయించగా బుధవారం రావాలని సూచించింది.

Latest Updates