కరోనా టైమ్​లో కనికరం లేకపాయె..క్యూలైన్లో గర్భిణుల అవస్థలు

  •     వనస్థలిపురం ఏరియా హాస్పిటల్​లో గర్భిణుల అవస్థలు
  •     కరోనా పేషెంట్స్   మధ్యే ట్రీట్​మెంట్
  •     గంటల తరబడి క్యూలోనే…

హైదరాబాద్, వెలుగు: ట్రీట్​మెంట్ కోసం వనస్థలిపురం ఏరియా హాస్పిటల్​కి వస్తున్న గర్భిణులు కనీస సౌలత్​లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కూర్చునేందుకు కుర్చీలు కూడా లేకపోవడంతో గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ఈ దవాఖానకు వనస్థలిపురంతోపాటు ఎల్​బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం నుంచి గర్భిణులు, ఇతర రోగులు వస్తుంటారు. డైలీ వెయ్యి నుంచి 1,500 ఓపీ ఉంటుంది. గర్భిణులు మంగళ, గురువారాల్లో చెకప్​కి వస్తుంటారు. తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు. సరిపడా కుర్చీలు లేకపోవడంతో నిలబడాలంటే అవస్థ పడుతున్నారు. వందల మంది వస్తున్నా అధికారులు కరోనా టైమ్​లో ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించేలా ఏర్పాట్లు కూడా చేయలేదు. దాంతో భయంభయంగానే ట్రీట్​మెంట్​చేయించుకుని వెళ్తున్నారు.

పక్కనే కరోనా టెస్టులు

ఈ హాస్పిటల్​లో కరోనా టెస్టులు చేస్తున్నారు. ఐసొలేషన్​ సెంటర్​ కూడా ఉంది. గర్భిణులు, కరోనా సస్పెక్టర్స్​ ఓపీ ఒకే హాల్​లో ఉండడంతో రద్దీ ఏర్పడుతోంది. క్యూలో ఉన్న గర్భిణులను దాటుకునే కరోనా టెస్టుల కోసం వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ డైలీ 40దాకా పాజిటివ్​ కేసులు​వస్తుండడంతో గర్భిణులు, ఇతర రోగులు భయపడుతున్నారు. అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఏం పట్టించుకుంటలేరు

మా పక్కనే కరోనా ఓపీ చూస్తున్నరు. దాంతో ఎవరికి పాజిటివ్​ ఉందో తెలియక టెన్షన్​పడుతున్నం.  కుర్చీల్లేక గర్భిణులం గంటల తరబడి నిలబడి ఉంటున్నం. ఫిజికల్​ డిస్టెన్స్​పాటించే పరిస్థితి కూడా లేదు. పట్టించుకునే వాళ్లే లేరు.

‑ ప్రియాంక, గర్భిణి

కుర్చీల కోసం ఇండెంట్ పెట్టాం

హాస్పిటల్​కి గర్భిణులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉన్న కుర్చీలు సరిపోవడం లేదు. మరిన్ని కావాలని అధికారులకు రిక్వెస్ట్ పెట్టాం. ప్రతి ఒక్కరూ కరోనా గైడ్​లైన్స్​ పాటించాలని అవేర్​నెస్​ కల్పిస్తున్నాం. గర్భిణులు ఏ రోజు వచ్చినా చెకప్​ చేస్తాం. ఒకే రోజు రావాలనేం లేదు.

‑ హరిప్రియ, హాస్పిటల్​ సూపరింటెండెంట్

Latest Updates