ఓపి కోసం గర్భిణుల ఇక్కట్లు.. గంటల తరబడి నిరీక్షణ

రాష్ట్రంలోనే పేరుగాంచిన కోఠి మెటర్నిటీ హాస్పిటల్ లో గర్భిణులకు తిప్పలు తప్పటం లేదు. ముఖ్యంగా ఓపీ కోసం వచ్చేవారు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇరుకు షెడ్లు, ఉక్కపోతలోనే వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో హాస్పిటల్ కు ఓపీ కోసం వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు సగటున వెయ్యి మందికి పైగా గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు. కానీ ఓపీ కోసం వచ్చే వారికి సరైన వసతులు కల్పించలేకపోతున్నారు. ఏళ్లుగా హాస్పిటల్ వెనుక వైపు గేటు వద్దనే ఓపీ సేవలు కొనసాగిస్తున్నారు. అయితే ఓపీ కోసం వస్తున్నవారు సేద తీరేంత స్థలం లేదు. కొన్ని కుర్చీలు అందుబాటులో ఉంచినప్పటికీ 200 వందల మందికి మించి కూర్చునే అవకాశం లేదు. మిగతా వారంతా తమ వంతు వచ్చే వరకు గేట్ బయట వెయిట్​చేయాల్సిందే. ఎండకాలం కావటంతో గేటు బయట నిరీక్షిస్తున్న గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫుట్ పాత్ లపై కూర్చొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. చాలీచాలని షెడ్ల కింద సేద తీరుతున్నారు. పైగా ఓపీ సంఖ్య వందల్లో ఉంటుండటంతో ఉదయం 5 గంటలకే హాస్పిటల్ ఓపీ వద్దకు చేరుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అప్పటి నుంచి ఓపీ సేవలు అందేవరకు నిరీక్షించడమే వారి వంతు. ఒక్కో గర్భిణికి ఓపీలో వైద్య సేవలు అందాలంటే కనీసం 2 నుంచి 3 గంటలు వేచి చూడాల్సి వస్తోంది. ఎండకాలం కావటంతో చాలా మంది కళ్లు తిరిగి పడిపోతున్నారు. డాక్టర్లు మాత్రం 7 మందే ఉన్నారు. దీంతోనే గర్భిణులకు వైద్య సేవలు అందడంలో ఆలస్యం అవుతోంది. మరో నలుగురు డాక్టర్ల అవసరం ఉంది.

కెపాసిటీకి మించి బెడ్లు

అటు ఇన్ పేషెంట్ వార్డులోనూ గర్భిణిలు ఇబ్బందులు పడుతున్నారు. 160 బెడ్లు ఉండాల్సిన చోట 260 బెడ్లు వేశారు. నిత్యం ఇక్కడ 300 మంది వరకు అడ్మిట్ అవుతున్నారు. కొంతమందికి బెడ్ లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఎంతమంది వచ్చినా రిజెక్ట్ చేయకుండా అడ్మిట్ చేసుకుంటున్నామని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే బెడ్ పై ఇద్దరు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారు. బెడ్​ల కొరత కారణంగా చాలా మందిని డెలివరీ అయిన ఐదురోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తున్నారు. బెడ్ కు బెడ్ కు మధ్య కనీసం పది ఇంచుల దూరం కూడా ఉండటం లేదు. ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంటోంది. తల్లి, బిడ్డతో పాటు వారి అటెండెంట్లు ఉండటంతో ఇన్ పేషెంట్ వార్డులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. గాలి రాని పరిస్థితి ఉంటోంది. కొత్త భవనం అందుబాటులోకి వస్తేనే సమస్య తీరుతుంది.

పది మందికి ఒక్కరే నర్సు

ఇక్కడ సిబ్బంది కొరత వేధిస్తోంది. భవనంలో160 పడకల కెపాసిటీ మాత్రమే ఉంది. కొత్త బిల్డింగ్ నిర్మాణం అవుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న భవనంలో మరో 100 పడకలను అదనంగా సర్దుబాటు చేశారు. అందుకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించాల్సిన విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. హాస్పిటల్​లో 28 మంది నర్సులు, 12 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి ముగ్గురు పేషెంట్లకు ఒక్క నర్సు ఉండాలి. కానీ పది మందికి ఒక్క నర్సు సేవలందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉన్న డాక్టర్లు, నర్సులపై ఒత్తిడి పెరుగుతోంది. చాలా వరకు డబుల్ డ్యూటీలు చేస్తున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ కూడా

Latest Updates