అద్దెకు ప్రీమియం  లగ్జరీ కార్లు

డ్రైవెన్ సంస్థకు చెందిన ‘కార్‌‌‌‌టు డ్రైవ్’ కార్ సబ్‌ స్క్రిప్షన్ సేవలను హైదరాబాద్‌ లో అధికారికంగా ప్రారంభిం చింది. నానో కారు నుండి ప్రీమియం, సూపర్ ప్రీమియం కార్లైన ఆడీ,లంబోర్గినీ వంటి కార్ల వరకు కార్‌‌‌‌టు డ్రైవ్‌‌లో అద్దెకు తీసుకోవచ్చు. రెండు గంటల సమయం నుండి మూడు, నాలుగేళ్ల వరకు కూడా కార్లు కిరాయికి లభిస్తాయి. కార్లతో పాటు సూపర్ ప్రీమియం బైక్‌‌లను కూడా అద్దెకిస్తున్నామని రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర గల 500 సీసీ పైబడిన లగ్జరీ బైక్‌‌లు,55 కు పైగా మోడల్స్ తమ వద్ద అందుబాటు లో ఉన్నాయని డ్రైవెన్ కోఫౌండర్ సయ్యద్ హుస్సేన్ తెలిపారు. రూ.కోటి కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపైనే ఎక్కువగా దృష్టిసా రిస్తున్నట్లు చెప్పారు . బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లలో సేవలంది స్తున్న కార్‌‌‌‌టు డ్రైవ్ త్వరలోనే మరిన్ని నగరాలకు తమ సేవలను విస్తరిం నున్నట్లు వెల్లడించారు. ఇప్పటిదాకా రూ.100 కోట్లు పెట్టు బడి పెట్టామని, త్వరలోనే ఏ సిరీస్ ఫండింగ్ ద్వారా 100 మిలియన్ డాలర్లు సమీకరిం చనున్నట్లు మరో కోఫౌండర్ కేదార్ చెప్పారు . ప్రస్తుతం అన్ని రకాల కార్లు కలిపి 155 వరకు ఉండగా, రానున్న ఏడాదిలో రూ.కోటి కంటే ఎక్కువ విలువ గల 3000 కార్లను అందుబా టులోకి తీసుకువస్తామని చెప్పారు. కారు కొనేకంటే సబ్‌ స్క్రిప్షన్ పద్దతిలోనే తక్కువ ఖర్చవుతుందని మరో కోఫౌండర్ అశ్విన్ తెలిపారు. రూ.కోటి విలువ గల కారుకు ఒక రోజుకు రూ.10 వేల రెంట్ ఉంటుం దని అన్నారు . ఎక్కువ రోజులకు సబ్‌ స్క్రిప్షన్ తీసుకుం టే ధర తక్కువగా ఉంటుం దని చెప్పారు . బ్లాక్‌‌గోల్డ్ సబ్‌ స్క్రిప్షన్ ద్వారా నెల నుండి ఎంత కాలానికైనా కారును వాడుకోవచ్చని, సర్వీసింగ్‌ తోపాటు మెయిం టనెన్స్ వంటివి కంపెనీయే భరి స్తుందని తెలిపారు. కస్టమర్ల ఇష్టానికనుగుణంగా కారును కస్టమైజేషన్ చేసిస్తామని చెప్పారు . కారును వాడుకున్న తరువాత అదే కారును కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉందన్నారు . త్వరలోనే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఈ వెహికిల్స్‌‌ను కూడా అందుబాటు లోకి తీసుకురానున్నట్లు అశ్విన్ చెప్పారు.

 

Latest Updates