పొట్టకూటి కోసమే కత్తులు తయారు చేస్తాం..చంపడానికి కాదు

వ్యవసాయ కోసం ఇతర పనుల కోసం కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లతో పాటు ఇతర పనిముట్లు తయారు చేస్తామని తెలిపారు బిట్టు శ్రీను కుటుంబ సభ్యులు. అడ్వకేట్ దంపతులు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శ్రీను కుటుంబ సభ్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం పనిముట్లు చేస్తామని..కత్తులు కావాలంటే తయారు చేసి ఇచ్చాము… అంతేకానీ చంపడానికి కాదన్నారు. మా వాళ్లను పోలీసులు తీసుకెళ్లారని.. అయితే వారిని ఏక్కడికి తీసుకెళ్లారో తెలియదంటున్నారు.

వామన్ రావు, నాగమణి దంపతుల హత్యకు మంథని పట్టణంలో కత్తులు తయారు చేశారనే సమాచారం తో  బాబు, రఘు, శ్రీను అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..వారిని విచారిస్తున్నారు.

Latest Updates