గ్రేటర్ ఎన్నికలకు సర్వం సిద్ధం

హైదరాబాద్: జీహచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌‌కు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని జోనల్ కమిషనర్ మమత అన్నారు. సిబ్బందికి అవసమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ‘కూకట్ పల్లి జోన్‌‌‌కు సంబంధించి 1,432 పోలింగ్ కేంద్రాల్లో 5,500 సిబ్బంది అవసరం. ఇప్పటివరకు 40 శాతం మంది రిపోర్ట్ చేశారు. మిగతావారు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రిపోర్ట్ చేస్తారు. సిబ్బందికి డీఆర్‌‌సీ సెంట్రల్‌‌లో పోలింగ్ సామాగ్రిని అందిస్తాం. సిబ్బందికి ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు మేమే సరఫరా చేస్తాం. మధ్యాహ్నం భోజనం చేశాక.. సామాగ్రితో బస్సులో పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేలా ఏర్పాట్లను పూర్తి చేశాం. సిబ్బందికి మాస్క్‌‌లు, శానిటైజర్‌‌లు ఇస్తున్నాం. చెక్ లిస్ట్ ప్రకారం బ్యాలెట్ బాక్స్‌‌లు, బ్యాలెట్ పేపర్‌‌లు ఇస్తున్నాం. సీనియర్ సిటిజన్స్, అంగ వైకల్యం కలిగిన వారికి , కరోనా బాధితులకు ఆన్ లైన్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కల్పించాం’ అని మమత పేర్కొన్నారు.

Latest Updates