GHMC ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు(మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు 9,101 పోలింగ్ కేంద్రాలను రెడీ చేశారు అధికారులు. ఎన్నికల కోసం 60 ఫ్లయింగ్ స్క్వా డ్లు, 30 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. మూడు కవమిషనరేట్ల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికలకు 52,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ సామాగ్రితో పాటు కరోనా కిట్లు, శానిటైజర్ల పంపిణీ చేశారు.
ఇప్పటికే ఆయా కేంద్రాల్లో మార్కింగ్ వేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 21 రకాల గుర్తింపు కార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ఎస్ఈసీ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.