ఉగ్రవాదం క్యాన్సర్ లా మారింది.. అణచాల్సిందే

పుల్వామా దాడిని ఖండించారు అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ. అమరులైన సైనికుల త్యాగాలు గొప్పవని కొనియాడారు. సైనికుల కుటుంబ సభ్యులకు, భారత ప్రభుత్వానికి సానుభూతిని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం క్యాన్సర్ లా వ్యాపిస్తోందని.. దానిని అణచడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. పుల్వామాలో జరిగిన దాడిలో 44మంది జవాన్లు అమరులయ్యారు.

పుల్వామా ఘటనపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ఉగ్రవాదులకు ధీటైన సమాదానం ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేయాల్సిందిగా భారత ఆర్మీకి ఆదేశాలిచ్చారు మోడీ.

Latest Updates