కరోనా కట్టడికి రాష్ట్రపతి విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు అన్ని దేశాలు  తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భారత్ కూడా కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లాక్ డౌన్ కూడా విధించింది. దేశంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి చేస్తున్న పోరాటానికి తన వంతు సాయం అందించనున్నట్లు ప్రకటించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. పీఎం సహాయ నిధికి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. వైరస్ ను కట్టడి చేసేందుకు… భారత  పౌరులందరూ పీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని కోవింద్ పిలుపు నిచ్చారు. రాష్ట్రపతి నిర్ణయంపై ప్రధాని మోడీ  కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates