హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామాను ఆమెదించారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. అంతకుముందు ఆమె కేంద్ర ఆహార శుధ్ధి పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్నారు. ఈ శాఖను కేంద్రవ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు అప్పగించారు.

రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు హర్ సిమ్రత్ కౌర్.  ‘‘రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ లు, చట్టాలకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశా. ఓ బిడ్డగా, ఓ సోదరిగా రైతుల పక్షాన నిలబడటం ఎంతో గర్వంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు(గురువారం)లోక్ సభలో అకాళీదళ్ ప్రెసిడెంట్, హర్ సిమ్రత్ కౌర్ భర్త సుక్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులు తీసుకురావడానికి నిరసనగా ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని చెప్పారు. పంజాబ్ ప్రభుత్వాలు 50 ఏళ్లపాటు పడిన కష్టాన్ని.. ఇప్పుడు తీసుకురాబోయే కొత్త చట్టాలు నాశనం చేస్తాయన్నారు.

ప్రగతి భవన్ వద్ద కలకలం.. కిరోసిన్ పోసుకున్నఆటో డ్రైవర్

చిన్నారి సుమేధ కోసం వెతుకుతున్న జీహెచ్ఎంసీ సిబ్బంది

ఒక్కరోజే 96,424 కేసులు..1174 మరణాలు

 

Latest Updates