రామ్‌జెఠ్మలానీ మృతిపై ప్రముఖుల సంతాపం

president-kovind-pm-modi-mourn-the-death-of-ram-jethmalani

సీనియర్ లాయర్, కేంద్ర మాజీ మంత్రి రామ్‌జెఠ్మలానీ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన మరణ పట్ల స్పందిస్తూ..  దేశం ఓ గొప్ప న్యాయవాదిని, మేధావిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తన మనసులో అనుకున్న మాటను ధైర్యంగా చెప్పే, మాట్లాడగల వ్యక్తి  రామ్‌జెఠ్మలానీ  అని ప్రధాని మోడీ అన్నారు. ఎమర్జెన్సీ రోజులలో, ప్రజా స్వేచ్ఛ కోసం అతను చేసిన పోరాటం, చూపించిన ధైర్య సాహసాలను దేశం గుర్తుంచుకొంటుందన్నారు. పేదవారికి సహాయం చేయడం రామ్‌జెఠ్మలానీ వ్యక్తిత్వంలో ఒక భాగమని అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పనితనం మాత్రం  ఎప్పటికీ మార్గదర్శకంగా నిలిచిపోతుందన్నారు. ఈ విచారకరమైన క్షణాలలో, ఆయన కుటుంబానికి, స్నేహితులకు తన సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు మోడీ తెలిపారు.

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రామ్ జెఠ్మలాని నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ జెఠ్మలానీ(95).. చికిత్సపొందుతూ ఇవాళ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

President kovind, PM Modi mourn the death of Ram Jethmalani

Latest Updates