అనిల్ కుమార్ భట్ కు ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్

president-ram-nath-kovind-confers-uttam-yudh-seva-medal-to-lieutenant-general-anil-kumar-bhatt

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో సైనిక పురస్కారాలు అందజేశారు రాంనాథ్ కోవింద్. ఇటీవలే వీరమరణం పొందిన విజయ్ కుమార్ కు కీర్తి చక్ర ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు విజయ్ కుమార్ సతీమణి. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్ లో విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. సీఆర్పీఎఫ్ కు చెందిన కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ పాండాకు మరణానంతరం కీర్తి చక్ర అవార్డు ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ప్రదీప్ కుమార్ సతీమణి అందుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కుమార్ భట్ కు ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్ ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులకు చెక్ పెట్టే ఆపరేషన్స్ విజయవంతం చేసినందుకు ఈ అవార్డుతో సత్కరించారు.

Latest Updates