శిరస్సు వంచి సుష్మాకు రాష్ట్రపతి నివాళులు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్‌కు నివాళులర్పించారు. సుష్మా స్వరాజ్‌ నివాసానికి వచ్చిన రాష్ట్రపతి ఆమె భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. తర్వాత ఆమె భర్తను, కుమార్తెను పరామర్శించారు. తిరిగి వెళుతున్న సమయంలో శిరస్సు వంచి సుష్మా భౌతిక కాయానికి నమస్కరించారు రాష్ట్రపతి.

Latest Updates