
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివుడు, పార్వతీ దేవీల వివాహాన్ని స్మరించుకునేందుకే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటామని కోవింద్ తెలిపారు. ఈ పండుగ మానవత్వానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ కూడా ప్రజలకు శివరాత్రి విషెస్ చెప్పారు. ‘మహాశివరాత్రి పర్వదినాన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. హర హర మహాదేవ’ అని మోడీ ట్వీట్ చేశారు.