నెల్లూరు జిల్లాలో వెంకయ్య టూర్ : రేపు రాష్ట్రపతి రాక

నెల్లూరు జిల్లాలో  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ బిజీగా ఉంటున్నారు వైస్ ప్రెసిడెంట్. పాలకూరు రోడ్డులో ఎఫ్‌ఎం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులకు ఫౌండేషన్ స్టోన్ చేశారు. నెల్లూరు దక్షిణ రైల్వే ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా పాల్గొన్నారు.

రేపు శుక్రవారం జిల్లాకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రానున్నారు. ఒకే కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కలిసి పాల్గొన్న సందర్భాలు చాలా అరుదు కావడంతో…. ఈ పర్యటన ఆసక్తి కలిగిస్తోంది.

Latest Updates