పత్రికా స్వేచ్ఛ: 180 దేశాల్లో ఇండియాకు 140వ స్థానం

పత్రికా స్వేచ్ఛలో భారత్‌‌ స్థానం దిగజారుతోంది.జర్నలిస్టులపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయి . పోలీసులు, మావోయిస్టులు, నేరగాళ్లు, అవినీతి నేతల నుంచి బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. వినకపోతే హత్య చేయడానికీ వెనుకాడని పరిస్థితులొచ్చాయి. 2018-19 ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ, ఇతర పరిస్థితులపై సర్వే చేసిన రిపోర్టర్స్‌‌ వితౌట్‌‌ బార్డర్స్‌‌ (ఆర్ వీబీ) ఈ విషయాలు వెల్లడించింది. 180 దేశాల ర్యాంకులను ‘ప్రెస్‌‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌‌’ పేరుతో విడుదల చేసింది. ఇందులో గతేడాది 138వ స్థానంలో ఉన్న ఇండియా ఈసారి 140వ స్థానానికి దిగజారింది. సూచీలో మూడోసారీ నార్వే తొలి స్థానంలో నిలిచింది. ఫిన్‌‌లాండ్‌‌, స్వీడన్‌‌, నెదర్లాండ్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి . తుర్కమెనిస్థాన్‌‌ చివరి స్థానంలో ఉంది.

2018లో ఆరుగురి హత్య….

ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా పత్రికలకు స్వేచ్ఛ తగ్గిందని ఆర్‌‌వీబీ తెలిపింది. 2018లో ఆరుగురు జర్నలిస్టులను చంపేశారని, మరొక హత్య విషయంలో అనేక సందేహాలున్నాయని చెప్పింది. 2018లో గౌరీ లంకేశ్‌ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2019లో ఎన్నికల వేడి ఎక్కువయ్యాక జర్నలిస్టులపై ప్రధాని మోడీ మద్దతు దారుల దాడులు పెరిగాయని, హిందుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే సోషల్‌‌ మీడియాలో దాడి ఎక్కువవుతోందని పేర్కొంది. ఫోన్లు చేసి మరీ చంపేస్తామని బెదిరిస్తున్నారని వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక మీడియా సంస్థల్లో పని చేస్తున్న వారి పరిస్థితి వర్ణించలేమంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ మరింత దిగజారిందని ఆర్‌‌వీబీ చెప్పింది. టర్కీలోని సౌదీ అరేబియా కాన్సులేట్‌‌ దగ్గర వాషింగ్టన్‌‌ పోస్టు జర్నలిస్టు జమాల్‌‌ ఖషోగీ హత్య, మయన్మార్‌‌లో ఇద్దరు రాయిటర్స్‌‌ జర్నలిస్టుల అరెస్టు , ఫిలిప్పీన్స్‌‌లో రాప్లర్‌‌ సీఈవో మారియా రెస్సాను టార్గెట్‌‌ చేయడం పరిస్థితిని అద్దం పడుతోందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదింటిలో ఒక దేశంలోనే పరిస్థితు లు బాగున్నాయని, మీడియాకు పూర్తి స్వేచ్ఛనిస్తున్న దేశాలు ప్రపంచంలో కేవలం పదిహేనేనని పేర్కొంది. అందులో 11 దేశాలు యూరోపియన్‌‌ యూనియన్‌‌లోనే ఉన్నాయంది. 71 దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, 19 దేశాల్లో తీవ్రంగా ఉందని తెలిపింది.

అమెరికాలో సమస్యాత్మకం….

ఉత్తర, దక్షిణ అమెరికాల్లోనూ ఆందోళనకర పరిస్థితులున్నాయని, ఈసారి అమెరికా 3 స్థానాలు తగ్గి 48 స్థానికి దిగజారిందని ఆర్‌‌వీబీ వివరించింది. బోట్స్‌‌వానా, చిలీ, రొమే నియా కన్నా కిందికి పడిపోయి సమస్యాత్మక కేటగిరీలో చేరిందని పేర్కొంది. బ్రెజిల్‌‌,వెనెజులాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయంది. యూరప్‌ లోనూ కొన్ని దేశాల్లో పరిస్థితు లేమంత బాలేవని వెల్లడించింది. మాల్టా , స్లోవేకియా, బల్గేరియాల్లో రిపోర్టర్ల హత్యలను ప్రస్తావించింది. బెదిరింపులు, చట్టా లతో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ఇటలీ, పోలాండ్‌‌, బల్గేరియా ప్రభుత్వాలపై విమర్శలున్నాయని చెప్పింది. ఇథియోపియా 40 స్థా నాలు పైకి నికరగువా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను ప్రసారం చేసిన జర్నలిస్టులపై దాడి చేసినందుకు గాను ఆ దేశం ర్యాంకు 24 స్థానాలు పడిపోయింది. రష్యా, చైనాల ర్యాంకులూ పడిపోయాయి. సెంట్రల్‌‌ ఆఫ్రికన్‌‌ రిపబ్లిక్‌‌ అత్యధికంగా 33 స్థానాలు దిగజారి రికార్డు నెలకొల్పింది. గతేడాది అక్కడ ముగ్గురు రష్యన్‌‌ జర్నలిస్టులను హత్య చేశారు. సౌదీ అరేబియా, అజర్‌‌బేజాన్‌‌, తుర్కమె నిస్థాన్‌‌ సూచీలో కిందున్నాయి . బ్రిటన్‌‌ 7 స్థానా లు మెరుగుపరుచుకొని 33వ స్థానానికి చేరింది. తన పక్క దేశం ఎరిత్రియాతో యుద్ధం జరుగుతున్నా ఇథియోపియా 40 స్థానాలు మెరుగుపరుచుకొని ఆశ్చర్యపరిచింది.

Latest Updates