గోదావరి నీళ్లు మళ్లించే ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి

  • జీఆర్ఎంబీకి మన రాష్ట్ర సర్కారు కంప్లైంట్‌‌
  • ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్టును అతిక్రమిస్తున్నారు
  • తెలంగాణ హక్కులకు వ్యతిరేకంగా నీళ్ల డైవర్షన్‌‌
  • ఫిర్యాదులో ఏపీ గవర్నర్‌‌ ప్రసంగం, ‘వీ6 – వెలుగు’ కథనం ప్రస్తావన

హైదరాబాద్, వెలుగు: పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా, పెన్నా బేసిన్‌‌కు తరలించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలని గోదావరి రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ను తెలంగాణ సర్కారు కోరింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌‌ను అతిక్రమించి ఏపీ సర్కారు చేపడుతున్న మళ్లింపు ప్రాజెక్టును ఆపేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీకి ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం లెటర్ రాశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన పోలవరం నుంచి గోదావరి జలాల మళ్లింపును, వీ6 వెలుగులో జూన్ 17న పబ్లిష్ అయిన ‘గోదావరిపై మా దారి మాదే” కథనాన్ని లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ కథనం క్లిప్పింగ్​ను జత చేశారు.

చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి

జూన్ 16న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తూ.. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. అందులో భాగంగా పోలవరం కుడి కాలువ కెపాసిటీని 50 వేల క్యూసెక్కులకు పెంచి కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు నీటిని మళ్లిస్తామన్నారని లెటర్‌‌లో ఈఎన్సీ ప్రస్తావించారు. పోలవరం నుంచి గోదావరి నీళ్ల మళ్లింపు ప్రాజెక్టుపై జూన్ 5న జరిగిన బోర్డు మీటింగ్‌‌లో ఏపీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని, మీటింగ్‌‌లో చర్చించిన అంశాలతో కూడిన మినిట్స్ కాపీని కంప్లైంట్‌‌కు జత చేశారు. అందుకు విరుద్ధంగా ఏపీ గోదావరి డైవర్షన్ ప్రాజెక్టును చేపడుతోందన్నారు. గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ వాటా తేలకుండా ఏపీ కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదని, ఇది తెలంగాణ హక్కులకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టన్నారు. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌‌ సమర్పించేలా ఏపీని ఆదేశించాలని.. బోర్డు, ఇతర టెక్నికల్ అప్రైజల్స్ వచ్చే వరకు ప్రాజెక్టుపై ముందుకెళ్లకుండా ఆదేశించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం 2014 జూన్ 2 తర్వాత చేపట్టిన పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్ స్కీమ్‌‌ల ద్వారా గోదావరి నీళ్లను ఇప్పటికే పెన్నా బేసిన్‌‌కు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు.

300 టీఎంసీల నీళ్లను..

గోదావరి నీళ్లను రోజుకు 3 టీఎంసీల చొప్పున రాయలసీమకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ‘‘వీ6 వెలుగు’’ కథనం ప్రచురించింది. పోలవరం కుడి కాలువ కెపాసిటీని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేలకు పెంచి 300 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు మళ్లించనుందని, ఈ ప్రాజెక్టును రూ.68 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోతోందని స్టోరీలో పేర్కొంది. ఈ విషయాన్ని తెలంగాణ ఈఎన్సీ తన కంప్లైంట్‌‌లో ప్రధానంగా ప్రస్తావించారు.

 

సెక్రటేరియట్ ఆవరణలో గుడి,మసీదులు కూల్చేసిన్రు

Latest Updates