కరోనా కంట్రోల్ కు ప్రివెంటివ్ క్యాబిన్

కరీంనగర్లో ట్రయల్ రన్ ప్రారంభం

జిల్లాకేంద్రంలో కరోనాబాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించి, నిత్యావసరాలను ఇంటివద్దకే తీసుకొచ్చి అందజేస్తోంది. టెక్నాలజీ
సాయంతో ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇండోనేషియా వాసులు తిరిగిన ప్రాంతాల్లో డ్రోన్లు, బూమ్ స్ప్రేయరతో డిస్ఇన్ ఫెక్టెంట్ ను అధికారులు స్ప్ చేస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్లపై పిచికారీ చేయించారు. చిన్న చిన్న కాలనీల్లో ఉపయోగించేందుకు 200 పవర్ స్ప్రేలు కొనుగోలు చేసి.. పారిశుద్ధ్యకార్మికులకు అందించారు. రోజూ కొన్ని వాడలు చొప్పున మొత్తం 60 డివిజన్లలో స్ప్రే చేయించారు. బస్టాండ్, మార్కె ట్, కలెకరే్టట్ వంటి
ఏరియాల్లో స్ర్పే చేయడానికి ఫైర్ ఇంజన్ పైపులను ఉపయోగించారు. ఇలా అందు బాటులో ఉన్న సాంకేతిక పరిఙానాన్ని వినియోగించుకుని నగరాన్ని శానిటైజ్ చేయడంలో విజయవంతం అయ్యారు.

ప్రివెంటివ్ క్యాబిన్ ట్రయన్ రన్ ప్రారంభం…
కరోనా వైరస్ను నియంత్రించేందుకు తయారుచేసిన ప్రివెంటివ్ క్యాబిన్ ట్రయల్ రన్ను మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం ప్రారంభించారు. బాడీ స్కానర్ ఆకారంలో తయారుచేసిన ఈ క్యాబిన్ లో30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇందులోకి ఎవరైనా వెళ్లగానే డిసిన్ఫెక్టెంట్ ఆవిర్లను విడుదల చేస్తుంది. ఒకవైపు నుంచి లోపలికి వెళ్లి , మరో  వైపు నుంచి బయటికి వచ్చేలోగా వేడి, ఆవిర్లకు శరీరంపై ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. రద్దీ ఏరియాల్లో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఈ క్యాబిన్లు ఉపయోగపడతాయి. ట్రయల్ రన్ సక్సెస్ అయితే నగరంలోని పలుచోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం
కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు కొత్తగా మొబైల్ కమాండ్ కంట్రోల్ వెహికల్ అందు బాటులోకి వచ్చింది. ఈ వెహికల్లో మూడు లేటెస్ట్ మోడల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో ఒకటి 360 డిగ్రీలు కవర్ చేస్తుంటే, మిగతావి చుట్టుపక్కల ప్రాంతాలను రికార్డు చేస్తాయి. లాక్డౌన్ నేపథ్యంలోరూల్స్ ఉల్లంఘించి రోడ్లపై కి వచ్చేవారిపై చట్టపరంగా చర్యలు
తీసుకునేందు కు ఈ కెమెరాల ఫుటేజీని సాక్ష్యంగా ఉపయోగిస్తారు. ప్రకృతి విపత్తుల వేళ హెచ్చరికలు చేయడానికి, సూచనలు చేయడానికి ఇందులో మైక్ సిస్టం కూడా ఉంటుంది. వారం క్రితం ఈ వాహనంలో కలెక్టర్ కె.శశాంక, సీపీ కమలాసన్ రెడ్డిఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఇన్స్‌పెక్టర్ సుధాకర్ ఈ వెహికల్ కు ఇంచార్జిగా వహరిస్తున్నారు.

Latest Updates