కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.5వేలు

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ భారత దేశంలోనూ విజృంభిస్తోంది. భారత్‌లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ పోతోంది. ఇప్పటికే వేలాది మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా అనుమానితులకు ఉచితంగానే వైద్య పరీక్షలు చేయిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షకు ఒక్క వ్యక్తికి రూ. 4500 నుంచి 5000 వేలు ఖర్చు చేస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ప్రకారం కరోనా వైరస్‌ ప్రాథమిక పరీక్షకు రూ. 1500, తర్వాత నిర్ధారణ పరీక్షకు రూ. 3500 ఖర్చు అవుతాయి.

కరోనా పరీక్షలకు అవసరమైన అత్యాధునికి పరిజ్ఞానాన్ని మన దేశంలోని ల్యాబ్‌లు జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని… దేశ వ్యాప్తంగా  డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న ‘ట్రివిట్రాన్‌ న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌’ చైర్మన్‌ జీఎస్‌కే వేలు తెలిపారు. అందుకే ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు రూ. 5 వేల వరకూ అవుతోందని చెప్పారు. ఈ టెక్నాలజీని మన దేశంలోనే అభివృద్ధి చేసుకున్నట్లయితే  పరీక్ష ఖర్చు రూ. 500 లకు మించబోదన్నారు.

Latest Updates