చైనా ఎటాక్‌ ప్రీ ప్లాన్డ్: రాహుల్‌ గాంధీ ఆరోపణ

  • ప్రభుత్వానికి తెలిసి కూడా పట్టించుకోలేదు
  • ట్వీట్‌ చేసిన రాహుల్


న్యూఢిల్లీ: ఇండియా – చైనా సరిహద్దులోని గాల్వాన్‌ దగ్గర చైనా చేసిన ఎటాక్‌ ప్రీ పాన్ల్‌ అని, దాని గురించి తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఒక న్యూస్‌ లింక్‌ను ఆయన ట్వీట్‌ చేశారు. “ 1. చైనాఎటాక్‌ ప్రీప్లాన్‌2. ప్రభుత్వం దాని గురించిపట్టించుకోకుండా నిద్ర పోయింది. 3. దానికి మన సైనికులు మూల్యం చెల్లించాల్సి వచ్చింది” అని మూడు పాయింట్లు చెప్తూ మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌‌ డిఫెన్స్‌ శ్రీపాద్‌ నాయక్‌ ఏఎన్‌ఐతో మాట్లాడిన న్యూస్‌ను రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. గాల్వాన్‌ ఘటనపై రాహుల్‌ గాంధీ మొదటి నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదని విమర్శించారు. కావాలనే వెపన్స్‌ లేకుండా పంపారని పలు విమర్శలు కూడాచేశారు. కాగా.. గాల్వాన్‌ ఘటనపై ప్రధాని మోడీ శుక్రవారం ఆల్‌ పార్టీ మీటింగ్‌పెట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 20 పార్టీల అధ్యక్షులు వర్చువల్‌గా భేటీ అవుతున్నారు. సోనియా గాంధీ, మమత బెనర్జీ కూడా పాల్గొంటారని అధికారిక వర్గాలు ప్రకటించాయి.

Latest Updates