గన్ గురి పెడితే ఎంత క్యాజువల్ గా రిప్లై ఇచ్చాడంటే…

దొంగోడు వస్తున్నాడంటే వణుకు పుట్టడం ఖాయం. కత్తితో ఒకడు నడిరోడ్డుపైన రెచ్చిపోతుంటే అందరికీ బెరుకే. ధైర్యంగా ఎదుర్కొన్నవాళ్లను శెభాష్ అని మెచ్చుకుంటుంటారు. అమెరికాలాంటి విదేశాల్లో అయితే… దొంగలు గన్స్ తో బెదిరిస్తుంటారు. బార్లు, మాల్స్ లో గన్స్ తో బెదిరించి రాబరీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. గన్ తో బెదిరిస్తే.. షాప్ యజమానులు, కస్టమర్లు బెదిరిపోవడం చాలా సర్వసాధారణం. గన్ పెడితే.. అడిగింది ఇచ్చేయాల్సిందే. కానీ.. ఇక్కడ ఓ డిఫరెంట్ గయ్ ను చూస్తారిప్పుడు.

ఓ బార్ లోకి దొంగ వచ్చాడు. వచ్చీరాగానే గన్ గురిపెట్టాడు. అందరూ ఎక్కడికక్కడ టేబుళ్ల కింద నక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. దొరికినవాళ్లను బెదిరించి డబ్బులు తీసుకున్నాడు ఆ దొంగ. ఐతే.. దొంగ వచ్చినా.. ఏం చేయలేడు అంటూ.. ఓ వ్యక్తి చాలా క్యాజువల్ గా కనిపించాడు. ఎప్పటిలాగే ఫోన్ లో వీడియో చూస్తుండిపోయాడు. ఫోన్ లాక్కున్నా ఇవ్వలేదు. సిగరెట్ ముట్టించాడు. అతడి ధైర్యానికి దొంగ కూడా ఏమీ అనలేకపోయాడు. చంపేస్తా అని బెదిరించినా భయపడలేదు ఆ వ్యక్తి. దొంగ వచ్చినప్పుడు అతడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కు పడీ పడీ నవ్వుతున్నారు ఇంటర్నెట్ యూజర్స్. ఈ వీడియో బీభత్సంగా వైరల్ అయ్యింది.

Latest Updates