తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు

తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు
  • కంపెనీల దగ్గర మస్తు స్టాక్​
  • భారీ ఆఫర్లకు చాన్స్​

న్యూఢిల్లీ: మొబైల్​ ఫోన్​ కొనే ఆలోచన ఉన్న వాళ్లకు ఇది గుడ్​న్యూస్​! కంపెనీలు కస్టమర్లపై డిస్కౌంట్లను, ఆఫర్లను గుమ్మరించడానికి రెడీ అవుతున్నాయి.  రాబోయే పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆన్​లైన్​,  ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో భారీ డిస్కౌంట్లను, క్యాష్​బ్యాక్​లను ఆశించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు, రిటైలర్లు చెబుతున్నారు. ఇన్​ఫ్లేషన్​ (ధరల పెరుగుదల), ప్రపంచవ్యాప్తంగా మోస్తరు డిమాండ్ వల్ల కంపెనీల దగ్గర భారీస్థాయిలో స్టాక్​ పేరుకుపోయింది. ఇదంతా అమ్మేందుకు కంపెనీలు కచ్చితంగా ధరలను తగ్గిస్తాయన్నది మార్కెట్​ ఎనలిస్టుల అంచనా.

"ఈసారి పండుగ సీజన్​లో భారత ఫోన్​ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బాగా తగ్గింపులు ఉంటాయని అనుకోవచ్చు.  2022 రెండో క్వార్టర్​లోనూ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్​లో డిస్కౌంట్ అమ్మకాలు పెరిగాయి.  రాబోయే క్వార్టర్​లో డిస్కౌంట్ల దూకుడు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని సీనియర్ ఎనలిస్టు రాజీవ్ నాయర్ అన్నారు.  ఈ క్యాలెండర్ సంవత్సరం మొదటి  ఆరు నెలల్లో తగినంతగా అమ్మకాలు లేవని, ఈ ఎఫెక్ట్​ను తట్టుకోవడానికి అన్ని బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రాబోయే పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించుకుంటాయని వివరించారు.   తమ సొంత వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేదా ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుండి అమ్మే ఫోన్లకు నో క్యాష్​ఈఎంఐ, స్పెషల్​ డిస్కౌంట్లను ఇవ్వాలని బ్రాండ్లు భావిస్తున్నట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ టెలికాం ఎనలిస్టు అభిలాష్ కుమార్ తెలిపారు. పేరుకున్న స్టాక్​ను క్లియర్ చేయడానికి డీప్ డిస్కౌంట్ ఒక మార్గమని కామెంట్​ చేశారు.

  • మార్జిన్లు పెరిగాయి..

స్టాక్​ను వదిలించుకోవడానికి ఈ ఏడాది  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రిటైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మార్జిన్లను పెంచాయి.  దీనివల్ల రిటైలర్లు మరింత తక్కువ ధరలకు ఫోన్లను అమ్ముతారు. "ఇన్వెంటరీలు పోగుబడ్డాయి. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్​ ప్లాట్​ఫారాలు స్టాకును తీసుకోవడం తగ్గించాయి. దీంతో ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రిటైలర్లకు భారీ డిస్కౌంట్లకు ఇస్తున్నారు. కొరియర్​లో చిక్కుకున్న స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇప్పుడు ఎక్కువ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మళ్లుతున్నాయి’’ అని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్​ ఖురానా అన్నారు.

చైనీస్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్ కంపెనీలు తమ దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇన్వెంటరీలను కూడబెట్టుకున్నాయి.  తూర్పు యూరప్​లోనూ అమ్మడం కష్టమవుతోంది. ఇండియాలో అన్ని బ్రాండ్ల వద్ద పాత స్టాక్​ దాదాపు ఎనిమిది కోట్ల వరకు ఉండొచ్చని స్ట్రాటజీ అనలిటిక్స్ డైరెక్టర్ శ్రవణ్ కుండోజ్జల చెప్పారు.  వీటిలో కొన్ని యూనిట్లను భారతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లించే అవకాశం ఉందన్నారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ బ్రాండ్ అయిన శామ్​సంగ్​కు​  ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల యూనిట్ల ఇన్వెంటరీ ​ఉందని సమాచారం.  కాగా,కిందటి ఏడాది 16 కోట్ల యూనిట్ల షిప్‌మెంట్లు జరిగాయని కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది.