కరోనా ఎఫెక్ట్: భగవంతుడికి మాస్క్

ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వేల మంది చనిపోయారు. ఇంకా వేలాది సంఖ్యలో భాదితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ భయం మనుషులకే కాదు…దేవుడికి పట్టుకుంది. వైరస్ కు బయపడి ముఖానికి మాస్కు కట్టుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని విశ్వనాథ్‌ ఆలయంలో ఈ విచిత్రం జరిగింది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు గుడిలోని శివ లింగానికి మాస్క్‌ పెట్టారు ఆ ఆలయ పూజారి. అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకరాదని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఆలయంలోని విగ్రహానికి మాస్క్‌ కట్టినట్లు తెలిపారు పూజారి. చేతులతో విగ్రహాన్ని తాకడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, భక్తులు స్వామివారిని చేతితో తాకితే.. కరోనా వైరస్‌ ఎక్కువ మందికి సోకే ప్రమాదముందన్నారు. కొద్ది రోజుల వరకు భక్తులు విగ్రహాన్ని తాకరాదని భక్తులను కోరుతున్నాడు పూజారి.

Latest Updates