కేసీఆర్ చీరలు.. దొడ్డుబియ్యం తేవద్దు: అమ్మవారి ఒడి బియ్యానికి పూజారుల కండీషన్లు

జనగామ, వెలుగు: దుర్గమ్మ తల్లికి కేసీఆర్​ చీరలు వద్దట.. దొడ్డు బియ్యం పనికి రావట.. ఉన్నంతలో తోచింది పెట్టి మొక్కులు తీర్చుకుం టమంటే కుదరనే కుదరదట..  ఒడి బియ్యం పొయ్యాలంటే సన్న బియ్యం .. ఖరీదైన చీరలే కావాలట.. అరె గిదేంది.. దుర్గమ్మ తల్లికి మొక్కు చెల్లించాలంటే గిన్ని కండీషన్లుంటయా అని అనుమాన పడకున్రి.. ఎందుకంటే ఉంటయ్ .. బరాబర్​ ఉంటయంటున్నరు జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట విజయదుర్గా గుడి వాళ్లు.. ఇక్కడ మొక్కులు చెల్లించాలంటే మేం జెప్పిన తీరుగా చీరలు, సన్నబియ్యం తేవాలె.. లేకుంటే అవి తీసుకోమని గుడి ముందు ఏకంగా బోర్డే పెట్టి న్రు.. కేసీఆర్​ చీరలు.. దొడ్డుబియ్యం తేవొద్దని సాఫ్ సీదా జెప్పేసిన్రు.. భక్తులు తమ శక్తి మేర కానుకలు సమర్పిస్తరనే విషయాన్నే మరిచి న్రు. ఇగ ఇక్కడి స్పెషల్ రూల్స్​ జూసి భక్తులు పరేషన్ అయితాన్రు. కేసీఆర్​ సారు ఇచ్చే చీరలంటే గింత ఇల్వ లేకుంటె నైఅంటున్రు. ఆలయ పోళ్లు ఇగనైనా పద్ధతి మార్చుకోవాలని భక్తులు కోరుతున్రు.

Latest Updates