శ్రీలంక పేలుళ్లను ఖండించిన ప్రధాని మోడీ

Prime Minister Narendra Modi condemned the bomb blasts in Sri Lanka

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ భయంకరమైన పేలుళ్లను తీవ్రంగా ఖండిస్తున్టట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో అటువంటి హింసాత్మక ఘటనలకు, అనాగరిక చర్యలకు చోటులేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు మోడీ చెప్పారు.

శ్రీలంకలో ఉగ్రదాడులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఖండించారు. ఈ ఆపద సమయంలో శ్రీలంకకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

Latest Updates