ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్

దేశంలో క‌రోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైంది. లాక్ డౌన్ మెదలైనప్పటినుంచి ముఖ్యమంత్రులతో ప్ర‌ధాని సమావేశం నిర్వ‌హించ‌డం ఇది ‌ఐదవసారి. ఈ సమావేశంలో రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సడలింపు, ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఈనేల 17తో మూడవ దశ లాక్ డౌన్ ముగియనున్న నేఫథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై చర్చ జ‌ర‌గనుంది. వైర‌స్ నేప‌థ్యంలో దేశంలోని రెడ్ జోన్, గ్రీన్ జన్, ఆరేంజ్ జోన్లలో పరిస్థితులను ఆడిగి తెలుసుకోనున్నారు ప్ర‌ధాని. మరోసారి లాక్ డౌన్ పెంచుతే ఎలాంటి పరిస్థితలను ఎదురవుతాయన్న దానిపైన కూడా సమాలోచనలు జరిపే అవకాశం ఉంది.

రాష్ట్రాల వారిగా కోవిడ్‌ నివారణకు చేపడుతున్న చర్యలను మోడీ ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు, సలహాలు కూడా ఆయ‌న ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రాలకు భారిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలని ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు…ఈ సమామేశంలో దీనిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Latest Updates