మిల్కీబాయ్ మహేష్ పై హాలీవుడ్ కన్ను

సూపర్ స్టార్ మహే బాబు చూడటానికి హాలీవుడ్ హీరోలా ఉంటారని ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. టాలీవుడ్ లో అతడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులోనే కాకుండా ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ అభిమానులు ఉన్నారు. సామ‌న్య ప్రేక్ష‌కులు మాత్ర‌మే కాకుండా ఇత‌ర సినీ పరిశ్ర‌మ‌లకు చెందిన ప్ర‌ముఖులు కూడా మ‌హేష్ న‌ట‌న‌ను ఇష్ట‌ప‌డ‌తారు. లేటెస్ట్ గా హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్ కూడా మ‌హేష్‌ ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. మ‌హేష్‌ బాబుతోపాటు వంశీ పైడిప‌ల్లి, ఏఆర్ మురుగ‌దాస్ వంటి ద‌ర్శ‌కుల‌ను ఆయ‌న లంచ్‌ కు ఆహ్వానించాడు.

`వంశీపైడిప‌ల్లి, మ‌హేష్ మీరు లాస్ ఏంజెల్‌ కు వ‌చ్చిన‌పుడు డౌన్‌ టౌన్ లాస్ ఏంజెల్స్‌ లో దిగి భోజ‌నానికి రండి. మనం ఇంటర్నేషనల్ స్పై సినిమా గురించి చ‌ర్చించుకుందాం` అని ట్వీట్ చేశాడు. అలాగే తమిళ డైరెక్ట‌ర్‌ ఏఆర్ మురుగ‌దాస్‌ ను కూడా లంచ్‌ కు ఆహ్వానించాడు. అయితే ఈ విషయంపై మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మహేష్ బాబును లంచ్ కు పిలిచారంటే త్వరలో ఏమైనీ హాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates