విడుదల చేయాలంటూ పెరూ జైల్లో ఖైదీల బీభత్సం.. 9 మంది మృతి

పెరూలోని మైగుల్ క్యాస్ట్రో జైలులో తమను విడుదల చేయాలంటూ ఖైదీలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా… పదుల సంఖ్యలో జైలు అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. జైలులో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 600 మంది ఖైదీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జైలులో ఒక్కసారిగా కలకలం రేగింది. తమను విడుదల చేయాలంటూ ఖైదీలందరూ కలిసి ఆందోళనకు దిగారు.

ఇందులో భాగంగా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు ఖైదీలు. చాలామంది ఖైదీలు జైలు గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించగా, మరికొందరు జైలు సిబ్బందిపై దాడికి యత్నించారు. ఫర్నీచర్ తగలబెట్టారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన 60 మంది జైలు సిబ్బంది, ఐదుగురు పోలీసులు, ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. 9 మంది చనిపోయారు.

Latest Updates