AP YCP రాష్ట్ర కార్యదర్శిగా సినీ నటుడు పృథ్వీరాజ్

ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సినీనటుడు పృథ్వీరాజ్ ను నియమించారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ.. కొన్నాళ్లుగా పొలిటికల్ గా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. వైసీపీపై విమర్శలను తిప్పికొడుతున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన పృథ్వీ ఆ తర్వాత.. మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో చంద్రబాబు పర్యటనతో టీడీపీ నవ్వులపాలు అయిందన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందనీ… ఆంధ్రలోనూ అదే ఫలితం రిపీట్ అవుతుందని చెప్పారు పృథ్వీ.

దివ్యవాణి ఇన్నాళ్లూ బాపూ బొమ్మ అనుకునేవాళ్లం.. కానీ ఆమె చంద్రబాబు బొమ్మ అయిపోయిందని అన్నారు. ఈసారి ఏపీలో న్యాయానికి, అన్యాయానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. వైఎస్ పథకాలే ఇంకా కొనసాగుతున్నాయని.. వాటికి పేర్లు మాత్రమే మారాయని చెప్పిన పృథ్వీ… మహానాయకుడు జనం గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు.

Latest Updates