మాదాపూర్‌లో కాలేజీ బస్సు బీభత్సం

హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించిన సంఘటన మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. మాధాపూర్, ఖానామెట్ సమీపంలో సెయింట్ పౌల్ ఫార్మసీ కాలేజీకి చెందిన మినీ బస్సు గోడకు ఢీకొట్టింది. పక్కనే కొత్త బిల్డింగ్ నిర్మిస్తుండటంతో సెల్లార్‌లోకి పడింది. అయితే సంఘటన సమయంలో బస్సులో విధ్యార్థులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది కాలేజ్ యాజమాన్యం.

డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో అతడిని సమీప హస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి స్పీడ్ డ్రైవింగ్ కారణం అన్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మాదాపుర్ పోలీసులు.

see also: బీచ్ లో యువకుడు గల్లంతు

టెన్త్​ నుంచే ఆన్​జాబ్​ ట్రైనింగ్​

కాగ్నిజెంట్‌ లో 20వేల మందికి జాబ్స్

Latest Updates