జీడిమెట్లలో బీభత్సం సృష్టించిన ప్రైవేట్ బస్సు

ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న బస్సు డ్రైవర్ అదుపుతప్పి ఓ ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ప్రత్యక్ష్య సాక్షుల కథనం ప్రకారం… ఐడీపీఎల్ నుంచి గండిమైసమ్మకు సూర్యసాయి ట్రావెల్స్ బస్సు విందు కోసం ప్రయాణికులను తీసుకెళ్తోంది. ఈ క్రమంలో చింతల్ షాథియేటర్ వద్దకు రాగానే డ్రైవర్ అదుపు తప్పి ముందు ఉన్న ఆటో, ద్వి చక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, బాధితులు తెలిపారు. తన పేరు సురేష్ అని డ్రైవర్ మద్యం మత్తులో ఇష్టానుసారం మాట్లాడుతుండటంతో స్థానికులు 108 కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. విందుకు వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు భయంతో బస్సు దిగిపోయారు.

Latest Updates