మంటలతో కాలిబూడిదైన బస్సు

తమిళనాడు: ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు కాలిబూడిదైంది. తమిళనాడులో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. చెన్నై నుండి బెంగళూరు వెళ్తుండగా క్రిష్ణగిరి జిల్లా సూలగిరి దగ్గర శర్మ ట్రావెల్స్ బస్సులో అనుకోకుండగా మంటలు చెలరేగాయి. సమయస్పూర్తితో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ప్రయాణికులు వేగంగా బస్సు దిగడంతో ప్రాణాపాయం తప్పింది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates