దివాళా స్థితిలో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు

కంతులు కట్టలేక వాహనాలు సరెండర్ చేస్తామంటున్న యజమానులు

చిక్కుల్లో 20 లక్షల మంది ఆపరేటర్లు

కోటి ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం

రూ.1.3లక్షల కోట్ల నష్టం

లాక్ డౌన్ ఎత్తివేసినా వ్యాపారాలు లేవు

బ్యాంకులకు లోన్లు కట్టలేక ఇబ్బందులు

రీస్ట్రక్చరింగ్ కోరుతున్న ఇండస్ట్రీ

ముంబై: కరోనా వ్యాప్తితో బస్సు చక్రాలకు బ్రేక్ పడింది. లక్షల మంది ఆధారపడిన ఈ ఇండస్ట్రీ ఇబ్బందులపాలై, దివాలా స్థితి కి వచ్చింది. ఆపరేటర్లకు సుమారు రూ.1.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గౌహతిలోని 30 బస్సులతో ట్రాన్స్‌ పోర్ట్‌‌ వ్యాపా రం నిర్వహించే అంజిత్ బోరా అనే వ్యక్తి.. కరోనా భయంతో తన బస్సులను నడపడం లేదు. లాక్‌డౌ న్ ఆంక్షలు ఎత్తివేసినా.. ఆయన బస్సులకు గిరాకీ లేదు. తను కట్టిన ఇన్సూరెన్స్ పాలసీ డబ్బు లు తీసి, 100 మంది వర్కర్లకు జీతాలు చెల్లించాడు. ఈ సమయంలో నేను వాళ్లను కాపాడకపోతే.. వారంతా ఎక్కడకని వెళ్తారు? అని అన్నాడు. అందుకే ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు తీసి వారికి జీతాలు ఇచ్చి ఆదుకున్నట్టు చెప్పాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది బస్సు ఆపరేటర్లు చాలా వరకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారే. బోరా లాంటి సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ట్రాన్స్‌ పోర్ట్ ఆపరేటర్లు తమ వ్యాపా రాలను కోల్పోయారు. ఈ రంగంలో పనిచేసే వారు కోటి మంది వరకు ఉంటారు. వీరిపై ఆధారపడి మరో 4 కోట్ల మంది ఉన్నా రు. మారటోరియం ఆప్షన్స్ ఎత్తివేయడంతో, సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది ట్రాన్స్‌ పోర్ట్ ఆపరేటర్లు డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇండస్ట్రీలో 75 శాతం మంది తమ బస్సులను ఫైనాన్స్ మీదే నడుపుతున్నారు. దేశంలో ప్రతి రోజూ పెరుగుతోన్న కరోనా కేసులతో ఇండియాలో బస్సుల వినియోగం ఇంకా తక్కువగానే ఉంది. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో బస్సు ఆపరేటర్లకు రూ.1.3 లక్షల కోట్ల టర్నోవర్ పోయింది. బస్సు అండ్ కారు ఆపరేటర్స్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా(బీఓసీఐ) డేటా ప్రకారం దేశంలో ప్రభుత్వం ఆపరేట్ చేసే బస్సులు 1,50,000 కాగా, ప్రైవేట్‌ బస్సులు 15 లక్షలుగా ఉన్నాయి . బస్సుల రాకపోకలు లేకపోవడంతో పలు ట్యాక్స్‌లు, లెవీల పరంగా ప్రభుత్వానికి ఇప్పటి కే రూ.50 వేల కోట్ల రెవెన్యూ తగ్గిపోయిందని బీఓసీఐ అధికార ప్రతినిధి చెప్పారు. డిసెంబర్ వరకు పరిస్థితి మారకపోతే.. ఇండస్ట్రీకి నెలకు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు రెవెన్యూ తగ్గిపోయే అవకాశం ఉందని బీఓసీఐ ప్రెసిడెంట్ ప్రసన్న పట్వర్థన్ అన్నారు. లోన్లను రీస్ట్రక్చర్ చేయాలన్నారు.

ఇంటర్​సిటీ సర్వీసులకు డిమాండ్

అభీబస్ రిపోర్ట్ ప్రకారం ఇంటర్‌‌‌‌సి టీ బస్సు ట్రావెల్‌ కు డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు నడిపే చాలా వరకు బస్సులు అందుబాటులో లేవు. కొన్ని ప్రైవేట్ బస్సులే తిరుగుతున్నాయి. కరోనా డిస్టాన్సింగ్ నార్మ్స్‌ తో తమ కెపాసిటీని సగం వరకు తగ్గించారు ఆపరేటర్లు. బస్సు, కారు ఆపరేటర్లు ఆర్జించే రూ.3.5 లక్షల కోట్ల యాన్యువల్ టర్నోవర్‌‌‌‌లో సుమారు మూడువంతుల వరకు.. ప్యాసెంజర్, రోడ్డు ట్యాక్ స్‌ లు, టోల్ ఛార్జీలు, ఫ్యూయల్ పన్నుల రూపంలో ప్రభుత్వాలకు వెళ్తోంది. గత ఆరు నెలల్లో డీజిల్ సేల్స్ యావరేజ్‌ గా 27.4 శాతం తగ్గింది. డీజిల్ కంన్సప్షన్ కూడా నెలవారీ రన్ రేటు గత ఆరు నెలల్లో 5177 వేల మెట్రిక్ టన్నులుగా ఉంది.

వెహికల్స్ సరెండర్ చేయడమే ఆప్షన్…

ప్రస్తుతం ఈ సమయంలో బస్సు ఆపరేటర్లు బ్యాంక్‌ లకు లోన్లు కట్టే పరిస్థితుల్లో లేనట్టు చెబుతున్నారు. లాక్‌ డౌన్ కాలంలో వడ్డీని మాఫీ చేసేందుకు, తమ లోన్లను రీస్ట్రక్చర్ చేసేందుకు లెండర్లకు వెహకల్స్‌ ను సరెండర్ చేయడం తప్ప తమ వద్ద ఇంకేమీ ఆప్షన్ లేదన్నారు. నోయిడాకు చెందిన అనిల్ దీక్షిత్ అనే ఆపరేటర్ నెలవారీ ఇన్‌ స్టాల్‌ మెంట్స్ కింద రూ.70 లక్షలు చెల్లించాలి. 225 బస్సులకు లోన్ల రీపే చేయాలి. కానీ కరోనా తర్వాత కేవలం 20 బస్సులు మాత్రమే ఆపరేషన్స్ సాగిస్తున్నాయి. మంత్లీ రెవెన్యూ కేవలం రూ.15 లక్షలుగానే ఉంది. లోన్‌ ఇన్‌ స్టాల్‌ మెంట్ల కంటే తక్కువగానే రెవెన్యూ ఉన్నట్టు దీక్షిత్ చెప్పారు. ఏజెంట్ల నుంచి లోన్ రీకలెక్షన్ కోసం పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ లోన్ రీస్ట్రక్చర్ పై లెండర్లు అసలు స్పందించడం లేదన్నారు. ఒకవేళ బ్యాంక్‌ లు ఫోర్స్ చేస్తే.. బస్సులను సరెండర్ చేయడం తప్ప తన దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదని అన్నారు. కరోనా తర్వాత పబ్లిక్ ట్రాన్స్‌ పోర్టేషన్ పూర్తిగా మారిపోయింది. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు తప్పనిసరి. మరో ఏడాది వరకు తమకు క్లిష్టస మయమేనని బస్సు ఆపరేటర్లు అంటున్నారు. బస్సు ఆపరేటర్లకు బ్యాంక్‌లు లోన్ రీస్ట్రక్చర్ చేయడం అవసరమని అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు. ఫైనాన్స్, రోడ్డు, కామర్స్, హోమ్ మంత్రిత్వ శాఖలకు, స్టేట్ గవర్నమెంట్లకు పలు రిప్రజంటేషన్లు పంపినట్టు తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. తమ ఇండస్ట్రీకి ఇది చాలా గడ్డు కాలమని పట్వర్థన్ పేర్కొన్నారు. లక్షల మంది ఆపరేటర్లు తమ ఆపరేషన్స్‌ ను మూసివేస్తారని, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates