ఫోర్జరీ డాక్యుమెంట్లతో.. కోఠి ప్యాలెస్‌ను అమ్మేశారు

ఓ ప్రైవేట్‌‌ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు నకిలీ డాక్యుమెంట్లతో ఓ ప్యాలెస్‌ను అమ్మేశారు. రూ.300 కోట్లు విలువైన హెరిటేజ్ ప్రాపర్టీని కాశ్మీర్‌‌లోని సంస్థకు కట్టబెట్టేశారు. ముంబైకి చెందిన నీహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ హైదరాబాద్ కింగ్ కోఠిలోని నజ్రి బాగ్ ప్యాలెస్‌‌ను ప్యాలెస్‌‌ ట్రస్టు నుంచి మూడేళ్ల క్రితం కొన్నది. గత జూన్‌‌లో ఆ సంస్థకు చెంది ఆఫీసర్లు వచ్చి చూస్తే ప్రాపర్టీ కాశ్మీర్‌‌కు చెందిన ఐరిస్ హాస్పిటాలిటీ పేరిట ట్రాన్స్‌‌ఫర్ అయినట్లు తేలింది. ఎంక్వైరీ చేస్తే సంస్థకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు అర్థమైంది. హైదరాబాద్ కు చెందిన రవీంద్రన్ (64), సురేశ్ కుమార్.. కంపెనీ తరఫున సంతకాలు పెట్టి ప్యాలెస్‌‌ అమ్మినట్టు గుర్తించారు. దీనిపై నీహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవీంద్రన్‌, సురేశ్‌లపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ అక్టోబర్‌‌ 10న రవీంద్రన్‌‌ హైదరాబాద్‌‌లోని ఎయిర్ పోర్టులో సింగపూర్ ఫ్లైట్ ఎక్కుతుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నివాసం నజ్రీ బాగ్ ప్యాలెస్‌‌.  ఆయన మరణం తర్వాత ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం అది సర్కారు కంట్రోల్‌‌లో ఉంది.

Private company employee sells Rs 300 cr Hyderabad palace by forging papers

Latest Updates